VIDEO: బస్సు టైర్ల కింద పడి వృద్ధుడికి తీవ్ర గాయాలు

MLG: గురువారం రాత్రి బస్సు దిగే క్రమంలో రాజయ్య అనే వృద్ధుడు బస్సు టైర్ల కింద పడిపోయి రెండు కాళ్లు కోల్పోయాడు. ములుగు మండలం జాకారం గ్రామానికి చెందిన రాజయ్యకు అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.