విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది: మంత్రి

HYDలోని ఆసిఫ్ నగర్‌లో తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ, హాస్టల్ భవనాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తుందని, రూ.8.7 కోట్లతో హాస్టల్ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు.