ఇందిరమ్మ మోడల్ హౌస్ పరిశీలన

SRPT: మునగాల మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణా పనులను శుక్రవారం మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష పరిశీలించారు. ఇంటి లోపల డిజైన్, సౌకర్యాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, ఏపీవో శైలజ తదితరులు పాల్గొన్నారు.