రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

SDPT: జగదేవపూర్ మండలంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైస్కూల్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో రమేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అతనితో పాటు బైక్‌పై వెళ్తున్న మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.