రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

CTR: కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని DK పల్లి రైల్వే గేట్ వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతిచెందాడు. ముఖం తీవ్రంగా దెబ్బతినడంతో గుర్తింపు సాధ్యంకాలేదని పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9000716436, 807408806 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.