రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ను కలిసిన ఎమ్మెల్యే
SKLM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయిపాటి శైలజాను శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక నగర పరిధిలో ఉన్న ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ఆమెకు సన్మానం చేశారు. ఇక్కడి అభివృద్ధి పథకాలు ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం వంటి అంశాలపై ఎమ్మెల్యేను ఆమె అడిగి తెలుసుకున్నారు. కూటమి నాయకులు ఉన్నారు.