సారా బట్టీలపై దాడులు

CTR: కుప్పం మండలం మోట్లచేను, అడవిబుదుగూరు, నార్మన్ కొట్టాలు, మల్లనూర్ పరిసర ప్రాంతాల్లో సార స్థావరాలపై ఎక్సైజ్ సీఐ నాగరాజ నేతృత్వంలో పలమనేరు బీఎంపీపీ సిబ్బంది దాడులు చేశారు. సారా బట్టీలను ధ్వంసం చేశారు. ఓ బైక్‌తోపాటు 10 లీటర్ల సారా సీజ్ చేశారు. కుప్పం నియోజకవర్గంలో సారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.