బీఆర్ఎస్ నాయకుడు ముందస్తు అరెస్ట్
NGKL: కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయడం లేదని నిరసిస్తూ BRS చేపట్టిన 'ఛలో అసెంబ్లీ' ముట్టడి నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ఇందులో భాగంగా కల్వకుర్తి మండలం మార్చలకు చెందిన BRSV జిల్లా నాయకుడు వట్టేపు కిషోర్‌ను మంగళవారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.