VIDEO: సంగమేశ్వర స్వామికి విశేష పూజలు

VIDEO: సంగమేశ్వర స్వామికి విశేష పూజలు

SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో ఆదివారం స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం, కృష్ణ పక్షం, తదియ, భానువాసరే పురస్కరించుకుని పార్వతీ సహిత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతర మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు. ఈ రోజు సెలవు దినం కావడంతో వేకువ నుంచి భక్తులు ఆలయానికి వస్తున్నారు.