VIDEO: 3 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ELR: కామవరపుకోట మండలం ఆడమెల్లి నుంచి తూ.గో. జిల్లా దూబచర్లకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యానును సివిల్ సప్లై అధికారులు శనివారం ద్వారకాతిరుమల శివారు వేపాలమ్మ ఆలయం వద్ద పట్టుకున్నారు. ఈ సందర్భంగా 3 టన్నుల బియ్యాన్ని, వ్యాన్ను సీఎస్ డీటీ నాగరాజు, వీఆర్వో మహాలక్ష్మి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. బియ్యం విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని తెలిపారు.