రాయచోటిలో ప్రాణం తీసిన కుక్కలు

రాయచోటిలో ప్రాణం తీసిన కుక్కలు

అన్నమయ్య: రాయచోటిలో అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. పట్టణంలోని గాలివీడు రోడ్డులో ఓ వ్యక్తి బైకుపై వస్తుండగా కొత్త పోలీస్ స్టేషన్ సమీపంలో వీధి కుక్కలు వెంటపడ్డాయి. ఈ క్రమంలో అతను అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న గుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మృతుడు పజిల్ (42)గా గుర్తించారు. వివరాలు తెలియాల్సి ఉంది.