సంగారెడ్డి జైలు విశిష్ఠత ఇదే..!

సంగారెడ్డి జైలు విశిష్ఠత ఇదే..!

SRD: ప్రస్తుతం సంగారెడ్డిలో ఉన్న జైలుకు ఎంతో ప్రత్యేకత ఉంది. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులను ఈ జైలులోనే ఉంచారు. 260 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు ఈ జైలును నిర్మించారు. ఆ తర్వాత జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ జైలును వినియోగించారు. జిల్లా జైలు కందికి తరలించిన తర్వాత కొన్నేళ్లు మ్యూజియంగా మార్చారు. ప్రస్తుతం ఈ జైలు శిథిలావస్థకు చేరింది.