'సీఎం పాలనలో భక్తులకు భద్రత కరువు'
KRNL: సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో భక్తులకు భద్రత కరువైందని ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ రాజీవ్ రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరులో కాశిబుగ్గ తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే ఘటనలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.