కొత్త బ్యాంకు ఖాతాలు తప్పనిసరి: కలెక్టర్

కొత్త బ్యాంకు ఖాతాలు తప్పనిసరి: కలెక్టర్

MDK: స్థానిక సంస్థల్లో పోటీచేసే ఆభ్యర్థులు తప్పనిసరిగా నూతన బ్యాంక్ అకౌంట్ తీయాలనీ, నూతన బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఎన్నికల లావాదేవీలు జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మెదక్ ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్లను పరిశీలించారు. పాత కులం సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందన్నారు. నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు.