'వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి'

NDL: భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు 3 వేల ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ (ఎంఎల్)లిబరేషన్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విషయంపై నేడు నంది కోట్కూరు తాహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, AAO షేక్షావలికి వినతిపత్రం అందించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎకరాకు 30 వేలు ఇచ్చి, రుణాలు రీ షెడ్యూల్ చేసి, 2 లక్షలు లోపు ఉన్న రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.