CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

ELR: ఆపదలో ఉన్న బాధితులకు ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయనిధి అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. గురువారం దెందులూరు గ్రామానికి చెందిన రామశెట్టి సతీష్‌కి రూ.40800, కాటంరెడ్డి సుబ్రహ్మణ్యంకి రూ.15,000 విలువగల CMRF చెక్కులను ఎమ్మెల్యే బాధితుల ఇంటి వద్దకు వెళ్లి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా చెక్కును అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.