గాలి పంపుతో ఆటలు.. వ్యక్తి మృతి
TG: రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్‌లో ఇద్దరు మిత్రుల సరదా తీవ్ర విషాదానికి దారి తీసింది. స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తున్న యూపీ యువకులు.. పరిశ్రమలో వాడే గాలిపంపుతో ఆటలు ఆడారు. ఈ క్రమంలో పవన్ అనే మిత్రుడి మలద్వారంలో పంపును సాయి అనే వ్యక్తి పెట్టి.. గాలి కొట్టాడు. దీంతో గాలి లోపలికి ఉద్ధృతంగా వెళ్లడంతో.. పేగులు దెబ్బతిని పవన్ (20) మృతి చెందాడు.