మంత్రులకు రాఘవుడి ఆహ్వాన పత్రిక

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలకు రావాలని మంత్రులు పయ్యావుల కేశవ్, కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణకు శ్రీ మఠం సహాయ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు ఆరాధన ఉత్సవాలు ఉంటాయని వారికి వివరించారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతి ఇచ్చిన మంత్రాక్షితలు, రాఘవేంద్ర స్వామి జ్ఞాపికను ఇచ్చారు.