పట్టణ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ
JGL: కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా 11వ వార్డ్ కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణను నియమించారు. ఈ నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబుతో పాటు పలువురు నాయకులు అందజేశారు. ప్రజా సమస్యలపై పోరాడాలని, మున్సిపల్‌లో పార్టీ గొంతు బలంగా వినిపించాలని సూచించారు. బాధ్యతలు అప్పగించిన నాయకులకు లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు.