జడ్చర్లలో రేషన్ దుకాణాల తనిఖీ
MBNR: జడ్చర్లలో జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బియ్యాన్ని పక్కదారిలో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని 500 రేషన్ షాపుల్లో ఈనెల 30 వరకు మూడు నెలల బియ్యం పొందవచ్చని తెలిపారు. రేషన్ షాపుల్లో ఇచ్చే సన్న బియ్యం నాణ్యత బాగుందని కార్డు దారులు పేర్కొన్నారు.