కదిరిలో ‘ఆపరేషన్ వజ్రపహార్’

కదిరిలో ‘ఆపరేషన్ వజ్రపహార్’

సత్యసాయి: కదిరిలో ఇవాళ తెల్లవారుజామున ‘ఆపరేషన్ వజ్రపహార్’ కింద పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అమీన్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, ఆర్ఎస్ రోడ్డు ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ విక్రేతలు, రౌడీషీటర్ల ఇళ్లను తనిఖీ చేశారు. అనుమానితులను విచారించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. లాడ్జీలను తనిఖీ చేసి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చూడాలని హెచ్చరించారు.