చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే
HNK: నగరంలోని 57వ డివిజన్ టీవీ టవర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ గత సంవత్సరం కురిసిన అకాల వర్షాలకు ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల చెక్కును స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అందించారు. క్లిష్ట సమయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందన్నారు.