జిల్లాలో వరస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు

కామారెడ్డి వ్యాప్తంగా రోజుకోచోట వరుస దొంగతనాలు పకడ్బందిగా నిగా పెట్టిన దొంగతనాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ ఉన్నా కూడా కామారెడ్డి మండలం, చిన్నమల్లారెడ్డి పరిధిలోని రాఘవేంద్రకాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో తాళం పగల కొట్టి 16 తులాల బంగారం, రూ. 60 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.