130 స్కూల్ బస్సులలో సాంకేతిక లోపాలు: డీటీవో
కోనసీమ: జిల్లాలో ఇంతవరకు పలు విద్యాసంస్థలకు చెందిన 260 బస్సులను తనిఖీ చేసామని జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 137 బస్సులలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ లోపాలను వారం రోజుల్లోగా సరి చేయించాలని అక్కడికక్కడే స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.