పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై పన్ను
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిఫైనరీలు విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్‌పై పన్ను విధించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ X వేదికగా వెల్లడించారు. అదే సమయంలో దేశంలో సరఫరా అయ్యే పెట్రోల్, డీజిల్‌పై పన్నుతగ్గించింది.