VIDEO: సీఎస్ఐ చర్చిలో అమెరికా యువత సందడి
SRD: పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అమెరికాకు చెందిన యువతీయువకులతో పాటు స్థానిక చిన్నారులు ఉత్సాహంగా నృత్యం చేశారు. వీరి ప్రదర్శనకు వీక్షకులు చప్పట్లతో నీరాజనాలు పలికారు. అనంతరం ప్రదర్శనలో పాల్గొన్న వారికి యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ప్రతినిధులు బహుమతులు అందజేసి అభినందించారు.