PGRS అర్జీదారులతో మాట్లాడిన కలెక్టర్
PGRSలో అర్జీదారుల అర్జీల పరిష్కారంపై బుధవారం రాత్రి కలెక్టర్ వినోద్ కుమార్ కంప్యూటర్ సెక్షన్ నుంచి ఫోన్ ద్వారా అర్జీదారులతో మాట్లాడారు. మ్యుటేషన్ చేయించుకోవడానికి అర్జీ పెట్టుకున్న వారితో సమీప గ్రామ సచివాలయంలో చలానా కట్టాలని కలెక్టర్ సూచించారు. అర్జీదారుల వివరాలు నోట్ చేసుకున్నామని, త్వరలో సమస్య పరిష్కారం చేస్తామని కలెక్టర్ చెప్పుకొచ్చారు.