గజపతినగరంలో ఘనంగా రంజాన్ వేడుకలు
VZM: గజపతినగరంలోని మదీనా మసీదులో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మత గురువు షేక్ ఖలీమ్ రజా రంజాన్ ప్రాముఖ్యతను వివరించారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కులమతాలకు అతీతంగా ఈ వేడుక జరుపుకున్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం రహీంతుల్లా, ఎస్ ఏ షరీఫ్ పాల్గొన్నారు.