'అభాగ్యులకు అండగా ఉంటా'

'అభాగ్యులకు అండగా ఉంటా'

E.G: అభాగ్యులకు తాము నిత్యం అండగా ఉంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న రాజమండ్రిలోని 42వ డివిజన్‌‌కు చెందిన దొండపాటి జ్యోతి అనే మహిళకు మందుల కొనుగోలు నిమిత్తం ఎమ్మెల్యే తమ భవానీ ఛారిటబుల్‌ ట్రస్టు తరపున గురువారం కలిసి రూ. 20,000 ఆర్ధిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.