రేపు జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్: కలెక్టర్
ఏలూరు జిల్లాలోని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో ఈనెల 10న సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు https://meekosam.ap.gov.in ద్వారా లేదా 1100 నంబరుకు ఫోన్ చేసి కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని ఆమె సూచించారు.