ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కార్పొరేటర్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కార్పొరేటర్

కరీంనగర్ 17వ డివిజన్‌లో కార్పొరేటర్ కవిత మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, డివిజన్‌కు చెందిన లత-శ్రీనివాస్ దంపతుల కుమార్తె వివాహానికి ఆమె హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, తన వంతు సహాయంగా రూ. 10,016 నగదును 'ఆడబిడ్డ కట్నం' కింద అందజేశారు. మాట తప్పకుండా పేద కుటుంబానికి అండగా నిలిచిన కార్పొరేటర్ తీరుపై స్థానికులు ప్రశంసించారు.