కార్మికుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తా: ఎమ్మెల్యే

కార్మికుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తా: ఎమ్మెల్యే

WGL: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల అభివృద్ధి సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసి చూపిస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో నేడు కార్మికుల దినోత్సవం వేడుకలను ప్రారంభించి పలు సంఘాల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణ నిమిత్తం ఉచితంగా స్థలాలను అందజేశారు