పార్కుకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

పార్కుకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

MHBD: గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో తొర్రూరు పట్టణ కేంద్రంలోని యతి రాజారావు పార్కు దగ్ధమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కత్తి రవీందర్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు, వాకర్స్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉండే పార్కును దగ్ధం చేసిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.