VIDEO: రొళ్ల ఎంపీడీవోపై వైసీపీ నేత దాడి
సత్యసాయి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బిల్లుల మంజూరు విషయంలో రొళ్ల ఎంపీడీవో నాగేశ్వరశాస్త్రిపై వైసీపీ మాజీ ఎంపీపీ భర్త విజయ రంగే గౌడ్ దాడికి పాల్పడ్డారు. ఎంపీడీవోను దుర్భాషలాడుతూ ఆయనపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి, ఎంపీడీవో నాగేశ్వరశాస్త్రి, విజయరంగే గౌడ్ ఇరువురూ పోలీస్ స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు.