త్వరలో చెర్లోపల్లెలో బండలాగుడు పోటీలు

త్వరలో చెర్లోపల్లెలో బండలాగుడు పోటీలు

KDP: పెండ్లిమర్రి మండలం చెర్లోపల్లెలో జగద్గురు సిద్ధగురుస్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా బండలాగుడు పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు శనివారం తెలిపారు. ఇందులో భాగంగా పోటీల్లో మొదటి బహుమతి రూ.60,000 ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా ఆరు బహుమతుల వరకూ ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు రూ.500 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.