నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLG: నల్గొండ పట్టణ పరిధిలో 11 కేవీ విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్ కో ఏడీఈ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. మిర్యాలగూడ రోడ్డు, ప్రకాశం బజార్, బస్టాండ్, మాన్యంచెల్క, బీటీఎస్, భారత్ గ్యాస్ గౌడౌన్ తదితర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.