తిరుపతి కమిషనర్ మౌర్యకు 31 ఫిర్యాదులు

తిరుపతి కమిషనర్ మౌర్యకు 31 ఫిర్యాదులు

TPT: నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 31 వినతులు అందాయని కమిషనర్ మౌర్య తెలిపారు. 23 మంది ప్రత్యక్షంగా, 8 మంది ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారన్నారు. చెత్త సమస్యలు, విద్యుత్ స్తంభాల మార్పిడి, డ్రైనేజ్ లీకేజీలు, అక్రమ నిర్మాణాల నియంత్రణ, టిడ్కో ఇళ్ల కేటాయింపు, టీడీఆర్ బాండ్ల మంజూరుపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.