రష్యా పౌరులకు ఉచిత వీసాలు: మోదీ

రష్యా పౌరులకు ఉచిత వీసాలు: మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. రష్యన్ పౌరులకు త్వరలో ఫ్రీ టూరిస్ట్ వీసాలు ఇస్తామని చెప్పారు. దీంతో 30 రోజుల పాటు వారు భారత్‌లో పర్యటించడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. భారత్‌లో అనేక పర్యటక ప్రదేశాలు ఉన్నాయని, ఈ ప్రాంతాలను సందర్శించాలని మోదీ కోరారు. రెండు దేశాల మధ్య పర్యాటకం బలోపేతం కావాలని ఆకాంక్షించారు.