శిథిలావస్థలో తహసీల్దార్ కార్యాలయం
అన్నమయ్య: తంబళ్లపల్లె తహసీల్దార్ కార్యాలయం ఏడాదిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ విషయంపై స్థానిక టీడీపీ నేతలు మంగళవారం PKMUDA ఛైర్మన్ సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కార్యాలయాన్ని సందర్శించి, నూతన కార్యాలయం నిర్మాణానికి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.