ఆ గ్రామ సర్పంచ్ కుర్చీ మూడోసారి మహిళకే
NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ సర్పంచ్ పదవికి మూడవసారి కూడా మహిళకే రిజర్వ్ అయింది. దీంతో పోటీ చేద్దామనుకున్న పురుషులకు నిరాశ ఎదురైంది. 2013లో బీసీ మహిళ, 2019లో ఎస్సీ మహిళ, ప్రస్తుతం జనరల్ మహిళకు కేటాయించారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి బండ గిరిజ, బత్తుల లక్ష్మీ ప్రసన్న, బొడిగె మహేశ్వరిలు పోటీలో నిలిచారు.