సిబ్బంది సంక్షేమమే మా మొదటి కర్తవ్యం: ఎస్పీ

సిబ్బంది సంక్షేమమే మా మొదటి కర్తవ్యం: ఎస్పీ

నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హోం గార్డ్ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన దర్బార్‌లో సిబ్బంది సమస్యలను తెలుసుకుని స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ వేతనాన్ని ₹921 నుంచి ₹1000కి పెంచిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, సిబ్బంది క్రమశిక్షణ, ఆరోగ్యం, విధి నిర్వహణలో బాధ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.