చెక్కు అందజేత.. ముగిసిన వివాదం

WGL: వర్ధన్నపేటలో తులసి మహిళ గ్రూప్ అధ్యక్షురాలు అంగోతు అమ్మి, ఉపాధ్యక్షురాలు బానోతు కవిత, సీఏ సరిత కలిసి రుణం మంజూరులో గ్రూప్ సభ్యులకు తెలియకుండా రూ.2 లక్షలు కాజేశారని గ్రూప్ సభ్యులు కవిత, నీల, మంగ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో శుక్రవారం పోలీసులు వారిని విచారణకు పిలిచారు. గ్రూప్ సభ్యుల సమక్షంలో రూ. 2.70లక్షల చెక్కును అందించారు. దీంతో వివాదం ముగిసింది.