మెరిట్ స్కాలర్షిప్‌కు ముగ్గురు విద్యార్థులు ఎంపిక
NTR: నందిగామ మండలం చందాపురం జిల్లా పరిషత్ పాఠశాల 2025 నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్‌కు ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అట్లూరి రాజశేఖర్ శుక్రవారం తెలిపారు. మాడుగుల జెస్సీ, పిల్లి శ్రావ్య, మాడుగుల అన్వేష్ ప్రతి సంవత్సరం ఒక్కొక్క విద్యార్థికి కేంద్ర ప్రభుత్వం 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కాలర్షిప్ అందజేస్తుందని అన్నారు.