నగరాన్ని కమ్ముకున్న పొగమంచు
శ్రీకాకుళం నగరంలో ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తోంది. దట్టమైన పొగమంచుతో రహదారులపై ప్రయాణికులు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నగరు శివారు ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పూట బయటకు వెళ్ళేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.