ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే
సత్యసాయి: మడకశిర పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. విద్యుత్ సమస్య, డ్రైనేజీ వ్యవస్థ వంటి వాటిపై ప్రజలు అర్జీలు అందజేశారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.