'అభాగ్యులకు అండగా ఉంటాం'

'అభాగ్యులకు అండగా ఉంటాం'

E.G: అభాగ్యులకు తాము, కూటమి ప్రభుత్వం నిత్యం అండగా ఉంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రిలోని చిన్నగాంధీ బొమ్మ వీధిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే శనివారం పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని తాము అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.