తుంగభద్ర గేట్లు ఎత్తివేత.. ప్రజలు అప్రమత్తం

NLR: నందవరం మండల పరిధిలో ఉన్న నదీతీర ప్రాంతాల ప్రజలకు పోలీసు అప్రమత్తం చేశారు. ఎస్సై కేశన్న ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గ్రామాలకు వెళ్లి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ.. తుంగభద్ర జలాశయ ఏగువ నుంచి వర్షాలు భారీగా కురుస్తుండడంతో వరద ప్రవాహం పెరిగిందని, తుంగభద్ర డ్యామ్ నుంచి గేట్లు ఎత్తి దిగువన నీరు వదులుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.