75మిల్లుల్లో ధాన్యం కొనుగోళ్లు

75మిల్లుల్లో ధాన్యం కొనుగోళ్లు

MLG: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రైస్ మిల్లులో రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలోని మొత్తం 87రైస్ మిల్లులకు గాను 75మిల్లుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టారు. మిగతా మిల్లులో బాయిలర్లు, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో కొనుగోలు చేపట్టలేదు.