ఓడిపోయిన అభ్యర్థి ఇంటిపై ట్రాక్టర్‌తో దాడి!
TG: సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అక్కడకక్కడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. కామారెడ్డి జిల్లా సోమార్ పేట గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఓడిపోయిన అభ్యర్థి బాలరాజు ఇంటిపై గెలిచిన అభ్యర్థి సాయిబాబా.. ట్రాక్టర్‌తో దాడి చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాలరాజు కుటుంబసభ్యులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.