ప్రయాణికుల దాహార్తి తీరుస్తున్న ఆర్టీసీ కండక్టర్

ప్రయాణికుల దాహార్తి తీరుస్తున్న ఆర్టీసీ కండక్టర్

ADB: ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బస్సుల్లో ప్రయాణించేవారు నీటి కోసం కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో కండక్టర్ షేక్ నజీర్ తన బస్సులో ప్రత్యేకంగా వాటర్ క్యాన్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు చల్లని నీటిని అందించారు. ఆయన చొరవను డిపో మేనేజర్ ప్రతిమ రెడ్డి అభినందించారు.